
క్రీడలు

ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు మయాంక్ చక్రవర్తి, ప్రతీతి బోర్డోలోయ్ అద్భుత ప్రదర్శనతో టైటిళ్లు కైవసం చేసుకున్నారు. బుధవారం జరిగిన క్లాసికల్ విభాగం చివరి రౌండ్‌ను ఇద్దరూ డ్రాగా ముగించారు. దీంతో మయాంక్ 7.5 పాయింట్లతో బాలుర విభాగంలో విజేతగా నిలిచాడు. ఆర్టిం పిన్‌జిన్ (రష్యా) రజతం, భారత్‌కు చెందిన దక్ష్ గోయెల్ కాంస్యం సాధించారు.
బాలికల క్లాసికల్ విభాగంలోనూ భారత్ జోరు కొనసాగింది. ప్రతీతి బోర్డోలోయ్ 7.5 పాయింట్లతో స్వర్ణ పతకం అందుకుంది. మరియా ఖోల్యావ్‌కో (కజకిస్థాన్) రజతం, భారత క్రీడాకారిణి నివేదిత కాంస్యం సాధించారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెందిన శరణ్య, అద్వైత్ తమ తమ విభాగాల్లో ఆరో స్థానంతో పోటీని ముగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!