
జనరల్

శివ కుమార్ కాసారం, శ్వేతా లక్ష్మణ్ ప్రధాన పాత్రల్లో నిశాంత్ దోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘సహ (లైఫ్ ఆఫ్ సంజు)’. తేజేశ్వర్ వేల్పుచర్ల నిర్మిస్తున్న ఈ సినిమాలో వ్రజన పాండ్య, మహిపాల్, సునీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
‘సహ’ చిత్రం సంజు అనే వ్యక్తి జీవితంలోని వివిధ దశలను చూపించే భావోద్వేగభరిత కథగా రూపొందినట్లు చిత్రబృందం తెలిపింది. అతని ప్రేమ, బ్రేకప్, మధుర జ్ఞాపకాలు, జీవితంలో ఎదురైన సవాళ్లను సినిమాలో ఆవిష్కరించనున్నారు. ప్రతి ప్రేక్షకుడికి దగ్గరయ్యేలా సంజు జీవిత ప్రయాణాన్ని తెరకెక్కించినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!