

ఓపెన్‌ఏఐ భారత్‌లో చాట్‌జీపీటీ యాడ్స్ కార్యక్రమాన్ని విస్తరిస్తోంది. 18 ఏళ్లు పైబడిన ఫ్రీ, గో ప్లాన్ యూజర్లకు ఇకపై సంబంధిత సమాధానాల కింద స్పాన్సర్డ్ ప్రకటనలు కనిపించనున్నాయి. యాడ్స్‌ను ప్రత్యేకంగా ‘Sponsored’గా గుర్తించడంతో పాటు.. చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలపై వాటి ప్రభావం ఉండదని ఓపెన్‌ఏఐ స్పష్టం చేసింది.
వినియోగదారులు ఉత్పత్తులను పరిశీలిస్తున్నప్పుడు, వివిధ ఎంపికలను పోల్చుతున్నప్పుడు లేదా నిర్ణయం తీసుకునే సమయంలో వ్యాపారాలకు తమను తాము పరిచయం చేసుకునే అవకాశం ఈ యాడ్స్ ద్వారా లభించనుంది. యూజర్ల చాట్స్, చాట్ హిస్టరీ, మెమొరీస్, వ్యక్తిగత వివరాలను ప్రకటనదారులతో పంచుకోబోమని ఓపెన్‌ఏఐ తెలిపింది. అలాగే యూజర్ డేటాను ప్రకటనదారులకు విక్రయించబోమని పేర్కొంది. యాడ్స్‌ను తొలగించడం, ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం, యాడ్ పర్సనలైజేషన్‌ను నియంత్రించడం వంటి ఆప్షన్లు కూడా యూజర్లకు ఉంటాయి. ప్లస్, ప్రో, బిజినెస్, ఎంటర్‌ప్రైజ్, ఎడ్యుకేషన్ ప్లాన్‌లు మాత్రం యాడ్-ఫ్రీగానే కొనసాగుతాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!