

ఈ ఏడాది అక్టోబర్‌లో టీమిండియా న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. టీ20, వన్డే, టెస్టు సిరీస్‌ల్లో భాగంగా మొత్తం 12 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ పర్యటనపై అభిమానుల్లో ఇప్పటినుంచే భారీ ఆసక్తి నెలకొంది. న్యూజిలాండ్ క్రికెట్ అంతర్జాతీయ సీజన్ టికెట్ల విక్రయాలు రికార్డు స్థాయిలో ప్రారంభమయ్యాయి. క్రికెట్ నేషన్ సభ్యుల ప్రీ-సేల్ మొదలైన 48 గంటల్లోనే 26 వేల టికెట్లు అమ్ముడైనట్లు న్యూజిలాండ్ క్రికెట్ తెలిపింది.
ఈడెన్ పార్క్‌లో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్‌లకు భారీ డిమాండ్ ఏర్పడగా, క్రైస్ట్‌చర్చ్‌లోని 9 వేల సీట్ల హాగ్లీ ఓవల్‌కు కూడా టికెట్ల విక్రయాలు జోరందుకున్నాయి. అక్టోబర్ 22, 24 తేదీల్లో జరిగే తొలి రెండు టీ20లు హౌస్‌ఫుల్ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రెండో టెస్టుకు కూడా మంచి స్పందన లభిస్తోంది. భారత పర్యటనపై అభిమానుల్లో ఉన్న ఉత్సాహమే ఈ రికార్డు విక్రయాలకు కారణమని న్యూజిలాండ్ క్రికెట్ చీఫ్ మార్కెటింగ్ అండ్ కమర్షియల్ ఆఫీసర్ గ్లెన్ క్రిచ్లీ తెలిపారు. సెప్టెంబర్ 7 నుంచి సాధారణ టికెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!