

నేపాల్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికులు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు సూచించారు. యాత్రికుల భద్రత, క్షేమం కోసం ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (ఏపీ సీఎంఓ), ఏపీ భవన్, నేపాల్‌లోని భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
నేపాల్‌లో చిక్కుకున్న ఏపీ యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ యాత్రికుల వివరాలు, వారి పరిస్థితిపై సమాచారం సేకరిస్తున్నట్లు చెప్పారు. యాత్రికులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని, ప్రభుత్వ యంత్రాంగం వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!