
గాసిప్స్

2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్‌కు ముందు భారత్.. దక్షిణాఫ్రికాలో ఆరు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. ప్రపంచకప్ దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరగనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తన ప్రపంచకప్ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడటం భారత్ సన్నద్ధతలో కీలకంగా మారనుంది.
2023 తర్వాత భారత్.. దక్షిణాఫ్రికాలో వన్డే మ్యాచ్ ఆడలేదు. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్, సెంచూరియన్ వంటి వేదికల్లో ఆరు వన్డేలు ఆడటం ద్వారా అక్కడి పిచ్‌లు, వాతావరణం, మ్యాచ్ పరిస్థితులకు భారత ఆటగాళ్లు ముందుగానే అలవాటు పడే అవకాశం ఉంటుంది. ప్రపంచకప్‌కు ముందు పరిస్థితులను అర్థం చేసుకోవడానికి ఈ సిరీస్ ఉపయోగపడనుంది.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!