

భారత్–పాకిస్థాన్ జట్ల మధ్య హాకీ పోరుకు మరోసారి రంగం సిద్ధమైంది. 2026 హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పూల్-డి కీలక మ్యాచ్‌లో ఇరు జట్లు బుధవారం సాయంత్రం 6:30 గంటలకు నెదర్లాండ్స్‌లోని ఆమ్స్ట్లీవీన్ వాగెనర్ స్టేడియంలో తలపడనున్నాయి. భారత్ తొలి మ్యాచ్‌లో వేల్స్‌పై 3-1తో గెలిచి, రెండో మ్యాచ్‌లో ఇంగ్లాండ్ చేతిలో 2-4తో ఓడింది. పాకిస్థాన్ ఇంగ్లాండ్ చేతిలో ఓడగా, వేల్స్‌తో డ్రా చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్–పాక్ మ్యాచ్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఈ మ్యాచ్‌లో ‘కరచాలనం’ అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. భారత్–పాకిస్థాన్ మధ్య రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ వేదికలపై ఇరు జట్ల ఆటగాళ్ల పరస్పర హ్యాండ్‌షేక్‌పై ఆసక్తి నెలకొంది. పూల్-డి నుంచి తదుపరి రౌండ్‌కు చేరుకోవాలంటే భారత్‌కు కనీసం డ్రా సరిపోతుంది. ఓడితే పాకిస్థాన్ ముందుకు వెళ్లే అవకాశాలు పెరుగుతాయి. భారత్ గెలిస్తే ఆరు పాయింట్లతో తదుపరి దశకు దాదాపు మార్గం సుగమమవుతుంది. మరోవైపు వేల్స్–ఇంగ్లాండ్ మ్యాచ్ ఫలితం కూడా సమీకరణాల్లో కీలకం కానుంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!