
బిజినెస్

జపాన్‌లో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్‌లో భారత షూటర్ నీరూ ధండా చారిత్రక స్వర్ణం సాధించారు. మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచారు. ఫైనల్లో 30 షాట్లకు 27 టార్గెట్లను ఛేదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో మహిళల ట్రాప్ వ్యక్తిగత విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించిన షూటర్‌గా నీరూ ధండా రికార్డు సృష్టించారు.
ఈ పోటీల్లో నీరూ ధండా ఇప్పటికే మహిళల ట్రాప్ టీమ్ విభాగంలో రజత పతకం సాధించిన భారత జట్టులో భాగంగా నిలిచారు. ఆ విభాగంలో నీరూ, ఆశిమా అహ్లావత్, మనీషా కీర్ కలిసి 328 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచారు. వ్యక్తిగత విభాగంలో నీరూ అద్భుతంగా రాణించి భారత్‌కు మరో స్వర్ణాన్ని అందించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!