

ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న పాకిస్థాన్ అండర్-19 జట్టుకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. ఓ మ్యాచ్ కోసం పోర్ట్స్‌మౌత్‌లోని హోటల్‌కు చేరుకున్న పాక్ క్రికెటర్లు బస్సు దిగుతుండగా, యాంటీ ఇమిగ్రెంట్ ఉద్యమకారులు వారిని అక్రమ వలసదారులుగా భావించారు. దీంతో సుమారు 40 మంది వరకు అక్కడికి చేరుకుని హోటల్ వెలుపల నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న అధికారులు వారికి పాక్ జట్టు అక్కడికి ఎందుకు వచ్చిందో వివరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం స్థానిక కౌన్సిలర్ జార్జ్ మాడ్గివిక్ పాక్ అండర్-19 జట్టు కోచ్‌తో మాట్లాడి, ఆందోళనకారులతోనూ చర్చించారు. క్రికెటర్లు అక్రమ వలసదారులు కాదని వివరించడంతో కొన్ని నిమిషాల తర్వాత వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఈ ఘటనకు ఆన్‌లైన్‌లో వైరల్ అయిన ఓ ఫొటో, దానికి సంబంధించిన తప్పుడు సమాచారం కారణమై ఉండొచ్చని కౌన్సిలర్ తెలిపారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పోర్ట్స్‌మౌత్ నార్త్ ఎంపీ అమందా మార్టిన్ కూడా స్పందిస్తూ, తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవాలని, ఇలాంటి వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా, పాక్ అండర్-19 జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్‌తో సిరీస్ ఆడుతోంది. ఈ నెల 2 నుంచి 5 వరకు జరిగిన యూత్ టెస్టులో పాకిస్థాన్ 10 పరుగుల తేడాతో ఓడింది. అనంతరం ఈ నెల 9న జరిగిన తొలి యూత్ వన్డేలో 177 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!