

2026 ఆసియా క్రీడల్లో భారత్, పాకిస్థాన్ క్రికెట్ జట్ల మధ్య పోరు సాధారణ మ్యాచ్‌గా కాకుండా పతక సమరంగా మారే అవకాశం ఉంది. పురుషుల విభాగంలో భారత్, పాక్ టాప్ సీడెడ్ జట్లుగా నేరుగా క్వార్టర్‌ఫైనల్‌కు అర్హత సాధించాయి. సెప్టెంబర్ 28న భారత్ క్వార్టర్‌ఫైనల్-2లో, పాకిస్థాన్ క్వార్టర్‌ఫైనల్-1లో బరిలోకి దిగనున్నాయి. డ్రా ప్రకారం ఇరు జట్లు సెమీఫైనల్లో ఎదురుపడే అవకాశం లేదు.
ఇరు జట్లు ఫైనల్‌కు చేరితే అక్టోబర్ 3న స్వర్ణ పతకం కోసం తలపడతాయి. సెమీఫైనల్లో ఓడితే అదే రోజు కాంస్య పతక పోరులో ఢీకొనే అవకాశం ఉంది. మహిళల విభాగంలోనూ భారత్-పాక్ పోరు ఫైనల్ లేదా కాంస్య పతక మ్యాచ్‌లోనే జరిగేలా డ్రా ఉంది. ఆసియా క్రీడల్లో క్రికెట్ పోటీలు టీ20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. పురుషుల భారత జట్టుకు శ్రేయాస్ అయ్యర్, మహిళల జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!