

బ్రెడీ క్రికెట్ క్లబ్ వేదికగా ఐర్లాండ్‌పై జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ 92 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2027కు అఫ్గాన్ నేరుగా అర్హత సాధించింది. ఐసీసీ నిబంధనల ప్రకారం వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచే జట్లకే డైరెక్ట్ ఎంట్రీ లభిస్తుంది. ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో ఉన్న అఫ్గాన్, ఈ సిరీస్‌లో ఒక్క విజయం అవసరముండగా, రెండో వన్డేలో గెలిచి అర్హతను ఖాయం చేసుకుంది. ఇది అఫ్గాన్‌కు నేరుగా వరల్డ్ కప్‌కు అర్హత సాధించిన రెండో సందర్భం.
అఫ్గాన్ విజయం ఐర్లాండ్, వెస్టిండీస్ జట్లకు భారీ షాక్‌గా మారింది. ఐర్లాండ్ 4-0తో సిరీస్ గెలవాల్సి ఉండగా, తొలి మ్యాచ్ వర్షంతో రద్దవడం, రెండో మ్యాచ్‌లో ఓటమి పాలవడంతో వారి ఆశలు ముగిశాయి. మరోవైపు వెస్టిండీస్ కూడా నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోయింది. ఇప్పటికే 2023 వరల్డ్ కప్‌కు దూరమైన కరేబియన్ జట్టు, ఈసారి కూడా కష్టాల్లో పడింది. 2027 వరల్డ్ కప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!