26, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

Writer: Pooja 04:41 PM, 26 ఆగస్టు, 2026
తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

తెలంగాణలో ఈ ఏడాది డిసెంబర్‌లో 8వ ఎడిషన్‌ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌’ నిర్వహించనున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ వేదికలుగా జరిగే ఈ పోటీల్లో 25 క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 6 వేల మందికి పైగా యువ క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉంది. ఆతిథ్య రాష్ట్రంగా తెలంగాణ ఒక స్థానిక క్రీడను ప్రతిపాదించడంతో పాటు మరో కొత్త క్రీడను కూడా చేర్చనుంది.

యూత్‌ గేమ్స్‌ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.22 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్‌, స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, సీబీఎస్‌ఈ తదితర సంస్థల సమన్వయంతో పోటీలు నిర్వహించనున్నారు. తెలంగాణకు ఈ అవకాశం దక్కడంపై కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా ద్వారా దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం లభిస్తోందని ఆయన అన్నారు.

తెలంగాణలో ఖేలో ఇండియా పథకం కింద ఇప్పటికే దాదాపు రూ.30 కోట్లతో క్రీడా మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేశామని కిషన్‌ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 33 ఖేలో ఇండియా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌, నేషనల్‌ స్పోర్ట్స్‌ ఫెడరేషన్లకు సహాయం, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా పథకాల ద్వారా క్రీడాకారులకు శిక్షణ, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ అనుభవం అందుతున్నాయని పేర్కొన్నారు.

మరోవైపు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ఆగస్టు 27న దేశవ్యాప్తంగా ‘ఖేల్‌ కీ బాత్‌, పీఎం కే సాథ్‌’ పేరుతో ఖేలో ఇండియా సంవాద్‌ నిర్వహించనున్నారు. దేశంలోని 1,500కు పైగా కళాశాలల్లో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యువ క్రీడాకారులతో వర్చువల్‌గా మాట్లాడి క్రీడలు, ఫిట్‌నెస్‌, యువత భాగస్వామ్యంతో దేశ నిర్మాణం వంటి అంశాలపై చర్చించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

ఆస్ట్రేలియా మహిళల క్రికెట్‌లో ఆడేందుకు అనయా బంగర్‌కు అనుమతి

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన ప్రజ్ఞానంద

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో సబలెంక, జొకోవిచ్‌కు షాక్

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు
ట్యాగ్లు
ఖేలో ఇండియాయూత్ గేమ్స్తెలంగాణ క్రీడలుక్రీడాభివృద్ధినరేంద్ర మోదీభారత క్రీడాకారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఆసియా జూనియర్ చెస్‌లో టైటిల్‌కు చేరువైన భారత ఆటగాళ్లు

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

డీఆర్ఎస్‌లో జడేజా వరుస వైఫల్యాలు.. గిల్‌కు కీలక సూచన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి సీరియల్‌ హీరో ముఖేష్‌ గౌడ?

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి
రాజకీయాలు

22ఏ భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

తెలంగాణలో  ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌
క్రీడలు

తెలంగాణలో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం
జనరల్

కృష్ణా జలాల తరలింపుపై హరీష్ రావు ఆగ్రహం

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...
జనరల్

కంగనా వివాదంపై తాప్సీ ఘాటు వ్యాఖ్యలు...

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..
జనరల్

కోనసీమ కుటుంబాలకు గుడ్‌న్యూస్‌..

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..
క్రీడలు

యశస్వి, వైభవ్‌ల దూకుడుపై సంజయ్ మంజ్రేకర్ అసంతృప్తి..

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..
టెక్నాలజీ

లీగల్‌ రంగంలోకి గూగుల్‌ జెమినీ ఎంటర్‌ప్రైజ్‌..

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...
జనరల్

మోహన్ బాబు మొదటి కారుకు ప్రాణం పోసిన మంచు విష్ణు...

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌
సినిమాలు

కాసర్ల శ్యామ్ ఆశీస్సులు తీసుకున్న అనిరుధ్‌

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..
జనరల్

నాగార్జునసాగర్‌ కేంద్రంగా మరోసారి జల జగడం..

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్
సినిమాలు

మెగా డాటర్ సుస్మిత నిర్మించిన వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!