

స్పెయిన్ ఫుట్‌బాల్ యువ సంచలనం లామిన్ యమాల్‌ను పోలిన కేరళ కుర్రాడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. కొల్లంకు చెందిన 15 ఏళ్ల పదో తరగతి విద్యార్థి అలెన్ జేమ్స్ చూపులు, ముఖకవళికలు యమాల్‌ను తలపిస్తుండటంతో ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షించాడు. తొలుత చాలామంది ‘నువ్వు యమాల్‌లా ఉంటావు’ అని చెప్పినా జేమ్స్ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఓ స్థానిక రాజకీయ నాయకుడు అతడికి స్పెయిన్ జెర్సీ వేసి వీడియో తీయడంతో.. జెర్సీలో జేమ్స్ అచ్చం యమాల్‌ను పోలినట్లు కనిపించాడు. దీంతో ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అయింది.
వీడియో వైరల్ కావడంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో ఈ కుర్రాడు ఎవరనే ఆసక్తి మొదలైంది. యమాల్ ముఖకవళికలను పోలిన జేమ్స్ ఫొటోలు, వీడియోలు నెట్టింట విస్తృతంగా చక్కర్లు కొడుతున్నాయి. యమాల్‌తో ఎలాంటి సంబంధం లేకపోయినా.. అతడి పోలికల కారణంగా అలెన్ జేమ్స్ అనూహ్యంగా సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారాడు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!