

అఫ్గానిస్థాన్‌తో ఈ నెల 13, 15, 16 తేదీల్లో జరగనున్న మూడు టీ20ల సిరీస్‌కు గాయాల నుంచి కోలుకున్న ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ నితీశ్‌కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా భారత జట్టులోకి తిరిగి వచ్చారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న ఈ నలుగురూ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో చికిత్స, పునరావాసం పూర్తి చేసుకున్నారు. అయితే అఫ్గాన్ సిరీస్‌లో వీరి తుది భాగస్వామ్యం ఫిట్‌నెస్ నిరూపించుకోవడంపైనే ఆధారపడి ఉంటుంది. ఆసియా క్రీడలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో ఆడి ఫామ్, మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించడం వీరికి కీలకం కానుంది.
ఐపీఎల్‌లో గాయపడిన హార్దిక్ పాండ్యా ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక కాలేదు. అతడు ఆసియా క్రీడలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని జట్టులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి మరోసారి అవకాశం దక్కింది. అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా తదితరులు జట్టులో ఉన్నారు. మూడు మ్యాచ్‌లకు దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియమే ఆతిథ్యమివ్వనుంది.
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, శివమ్ దూబె, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!