

2026 ఆసియా క్రీడల్లో భారత షూటర్లు అద్భుత ప్రదర్శన చేశారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సురుచి సింగ్, కమల్‌జీత్ జోడీ స్వర్ణ పతకం సాధించింది. ఫైనల్లో 484.6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన భారత జోడీ.. దక్షిణ కొరియా జంటపై 6.6 పాయింట్ల ఆధిక్యంతో విజయం సాధించింది. దక్షిణ కొరియాకు రజతం, ఇరాన్‌కు కాంస్యం దక్కాయి. క్వాలిఫికేషన్‌లోనూ 587 పాయింట్లతో సురుచి-కమల్‌జీత్ జోడీ అగ్రస్థానంలో నిలిచింది.
ఈ స్వర్ణం వెనుక చివరి నిమిషంలో తీసుకున్న కీలక నిర్ణయం కూడా ఉంది. తొలుత సురుచికి కేదార్‌లింగ్ బాలకృష్ణ ఉచగాన్వె భాగస్వామిగా ఉండాల్సి ఉండగా, అతని ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుని కమల్‌జీత్‌ను జోడీగా మార్చారు. వ్యక్తిగత ఈవెంట్లలో నిరాశ ఎదురైనప్పటికీ వీరిద్దరూ మిక్స్‌డ్ టీమ్‌లో సత్తా చాటారు. ఇదే రోజు పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ టీమ్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్, రుద్రాంక్ష్ పాటిల్, నీరజ్ కుమార్ 1762 పాయింట్లతో రజతం సాధించారు. చైనా స్వర్ణం, దక్షిణ కొరియా కాంస్యం గెలుచుకున్నాయి. ఐశ్వరీ, నీరజ్ వ్యక్తిగత ఫైనల్‌కు కూడా అర్హత సాధించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!