
బిజినెస్

థాయ్‌లాండ్‌లో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ సమయంలో పిడుగుపడటంతో 24 ఏళ్ల యువ ఆటగాడు సాఫ్వాన్ అవే ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ థాయ్‌లాండ్‌లో నిర్వహించిన గోలోక్ ఎఫ్ఏ కప్ టోర్నమెంట్‌లో భాగంగా మ్యాచ్ జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. వర్షం కురుస్తున్నప్పటికీ ఆట కొనసాగుతుండగా ఒక్కసారిగా పిడుగుపడి మైదానంలో ఉన్న ఆటగాళ్లను షాక్‌కు గురి చేసింది.
ఈ ఘటనలో సాఫ్వాన్ అవే తీవ్రంగా గాయపడి మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతడిని రక్షించేందుకు అత్యవసర వైద్య బృందాలు ప్రయత్నించినప్పటికీ ప్రాణాలు నిలుపలేకపోయాయి. మరో 12 మంది ఆటగాళ్లు కూడా గాయపడినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నిర్వాహకులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. థాయ్‌లాండ్ ఫుట్‌బాల్ అసోసియేషన్ సాఫ్వాన్ మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!