

సుచిక తరియాల్ ఆసియా క్రీడలు 2026లో చరిత్ర సృష్టించారు. మహిళల ట్రెడిషనల్ 60 కేజీల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) విభాగంలో కాంస్య పతకం సాధించి.. ఆసియా క్రీడల్లో ఈ క్రీడలో భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా నిలిచారు. క్వార్టర్ఫైనల్లో మంగోలియాకు చెందిన అల్తాంచిమెగ్ బైగల్మాను 2-0తో ఓడించి పతకాన్ని ఖాయం చేసుకున్న సుచిక.. సెమీఫైనల్లో సింగపూర్‌కు చెందిన హుయ్ హూన్ టియో చేతిలో ఓడిపోయారు. ఈ ఆసియా క్రీడల్లోనే MMA తొలిసారి ప్రవేశపెట్టారు.
సుచిక క్రీడా ప్రయాణం వెనుక ఎన్నో సవాళ్లు ఉన్నాయి. 12 ఏళ్ల వయసులో ఎదురైన వేధింపుల ఘటన తర్వాత ఆత్మరక్షణ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని నిర్ణయించుకుని జూడోలో శిక్షణ ప్రారంభించారు. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ జూడో, కురాష్, జియూ-జిట్సూ వంటి విభాగాల్లో పోటీపడ్డారు. 2024లో జియూ-జిట్సూలో ప్రపంచ టైటిల్ సాధించారు. గాయాలు, ఎంపిక ప్రక్రియలో ఎదురైన సవాళ్లు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించి చివరకు 36 ఏళ్ల వయసులో ఆసియా క్రీడల వేదికపై చారిత్రాత్మక పతకం సాధించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!