

ఫుట్‌బాల్ ప్రపంచంలో తనకు ఎందుకు ప్రత్యేక స్థానం ఉందో మరోసారి నిరూపించాడు లియోనల్ మెస్సిi. 39 ఏళ్ల వయసుకు చేరువవుతున్నా, మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నా తన ఆటలో ఏమాత్రం తగ్గేదేలేదని చాటాడు. ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లోనే అద్భుతమైన హ్యాట్రిక్‌తో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా కు 3-0 తేడాతో ఘన విజయాన్ని అందించాడు. 17వ నిమిషంలో తొలి గోల్ సాధించిన మెస్సి, 60వ నిమిషంలో రెండో గోల్ నమోదు చేసి, 76వ నిమిషంలో అసాధారణ సోలో రన్‌తో అద్భుతమైన మూడో గోల్ కొట్టి అభిమానులను మంత్రముగ్ధులను చేశాడు.
ఈ హ్యాట్రిక్‌తో మెస్సి ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడిగా మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును సమం చేశాడు. అలాగే ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ సాధించిన అత్యంత వయస్కుడైన ఆటగాడిగా నిలిచి, క్రిస్టియానో రొనాల్డో పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. తొలి గోల్ అనంతరం భావోద్వేగానికి గురైన మెస్సి కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయి. విశేషమేమిటంటే, 2006 ప్రపంచకప్‌లో తన తొలి గోల్ సాధించిన తేదీకి సరిగ్గా 20 ఏళ్ల తర్వాత ఈ చారిత్రాత్మక హ్యాట్రిక్ నమోదు చేశాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!