

దూకుడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకునే ఇషాన్ కిషన్ స్వదేశంలో మెరుగైన ప్రదర్శన చేస్తున్నప్పటికీ, విదేశీ పిచ్‌లపై మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే చర్చ మొదలైంది. వన్‌డౌన్‌లో కీలక ఇన్నింగ్స్‌లు ఆడగల సామర్థ్యం ఉన్న అతడు పవర్‌ప్లేలోనే క్రీజ్‌లోకి వచ్చినా భారీ షాట్లతో స్కోరు వేగాన్ని పెంచగలడు. అయితే న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లతో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శనలో నిలకడ కనిపించలేదు. ఈ జట్లతో ఆడిన మ్యాచ్‌ల్లో వరుసగా 1, 0; 56, 4, 13, 49; 1, 12 పరుగులు చేశాడు. ఈ ఏడాది మొత్తం 36 టీ20ల్లో 1,159 పరుగులు చేసిన ఇషాన్.. విదేశీ గడ్డపై గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో మాత్రం 135 పరుగులే సాధించాడు.
సేనా దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో ఇషాన్ ఇప్పటివరకు 10 టీ20 మ్యాచ్‌లు ఆడి 177 పరుగులు మాత్రమే చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 68 మ్యాచ్‌లకు 1,955 పరుగులు చేసిన అతడికి సేనా గడ్డపై ఒక్క అర్ధశతకం మాత్రమే ఉంది. అక్కడి పేస్, బౌన్స్‌కు తగ్గట్టుగా షాట్ల ఎంపికలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచకప్, 2028 టీ20 ప్రపంచకప్ సేనా దేశాల్లోనే జరగనున్న నేపథ్యంలో ఇషాన్ తన ఆటతీరును మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. న్యూజిలాండ్‌తో చివరి మ్యాచ్‌తో పాటు వన్డే సిరీస్‌లోనూ అవకాశం దక్కితే సత్తా చాటడం అతడికి కీలకం కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!