
గాసిప్స్

2030 కామన్వెల్త్ గేమ్స్ నిర్వహణకు సంబంధించి కీలక అప్‌డేట్ వెలువడింది. భారత క్రీడారంగానికి చెందిన ప్రముఖులు రాహుల్ ద్రవిడ్, సైనా నెహ్వాల్‌కు ఈ గేమ్స్ నిర్వహణలో కీలక బాధ్యతలు దక్కనున్నట్లు సమాచారం. టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌ను ఆర్గనైజింగ్ బోర్డు సభ్యులుగా నామినేట్ చేసినట్లు పలు నివేదికలు వెల్లడించాయి.
క్రీడాకారులుగా అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందిన వీరిద్దరికీ క్రీడారంగంలో అపార అనుభవం ఉంది. ఈ అనుభవం 2030 కామన్వెల్త్ గేమ్స్ ప్రణాళికలు, నిర్వహణలో ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. వీరి ఎంపికకు సంబంధించిన వార్తలు భారత క్రీడారంగంలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!