

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో పోటీ ఒలింపిక్స్‌కు ఏమాత్రం తగ్గదని అభిప్రాయపడింది. ఒలింపిక్స్, ప్రపంచ ఛాంపియన్‌షిప్, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన మీరాబాయికి ఆసియా క్రీడల పతకం మాత్రం ఇంకా అందలేదు. 2014లో తొమ్మిదో స్థానంలో నిలిచిన ఆమె.. 2023లో పతకానికి చేరువగా వచ్చి నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 2018లో గాయం కారణంగా ఆసియా క్రీడలకు దూరమైంది. తన బరువు విభాగంలో అత్యుత్తమ ప్రత్యర్థులు ఆసియా దేశాల నుంచే ఉన్నందున ఈసారి పోటీ అత్యంత కఠినంగా ఉంటుందని మీరాబాయి పేర్కొంది.
ఈసారి ఎలాగైనా ఆసియా క్రీడల పతకం సాధించాలన్న పట్టుదలతో ఉన్నట్లు 32 ఏళ్ల మీరాబాయి తెలిపింది. కామన్వెల్త్ క్రీడలు ముగిసిన వెంటనే శిక్షణ కేంద్రానికి చేరుకుని సన్నద్ధత ప్రారంభించినట్లు చెప్పింది. గతంలో 49 కిలోల విభాగంలో పోటీపడిన మీరాబాయి.. 2028 ఒలింపిక్స్‌లో ఆ విభాగాన్ని తొలగించడంతో ఈసారి 53 కిలోల విభాగంలో బరిలో దిగనుంది. ఆసియా క్రీడల పతకంతోనే ఇంటికి తిరిగి రావాలన్న లక్ష్యంతో ఆమె కఠిన సాధన కొనసాగిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!