

ప్రైమ్ వాలీబాల్ లీగ్ (పీవీఎల్) భారత ప్రొఫెషనల్ వాలీబాల్ చరిత్రలో మరో కీలక మైలురాయిని చేరుకుంది. అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) నుంచి అధికారిక గుర్తింపు పొందిన తొలి భారత ప్రొఫెషనల్ వాలీబాల్ లీగ్‌గా పీవీఎల్ నిలిచింది. గత నాలుగు సీజన్లలో సాధించిన విజయాలు, ప్రతిభావంతులైన ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో చేసిన కృషికి ఈ గుర్తింపు లభించింది. సీజన్-5 నవంబర్ 30 నుంచి ప్రారంభం కానుండగా, ఆగస్టు 17న గోవాలో ప్లేయర్ ఆక్షన్ నిర్వహించనున్నారు.
ఎఫ్‌ఐవీబీ గుర్తింపుతో పీవీఎల్‌లో పాల్గొనే క్లబ్‌లకు సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్ (CAVA), ఏషియన్ వాలీబాల్ కాన్ఫెడరేషన్ (AVC), అలాగే ఎఫ్‌ఐవీబీ క్లబ్ టోర్నమెంట్‌లలో అర్హత నిబంధనల మేరకు పోటీపడే అవకాశం లభించనుంది. ఈ గుర్తింపు భారత వాలీబాల్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే కీలక అడుగుగా నిలుస్తుందని లీగ్ నిర్వాహకులు అభిప్రాయపడ్డారు. సీజన్-5లో భారతీయులతో పాటు విదేశీ ఆటగాళ్లు కూడా బరిలోకి దిగనుండటంతో అభిమానులకు అత్యున్నత స్థాయి పోటీలు ఆస్వాదించే అవకాశం లభించనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!