
జనరల్

టీమిండియా వరుస అంతర్జాతీయ సిరీస్‌లతో బిజీగా ఉండనున్న నేపథ్యంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ అనంతరం రెగ్యులర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు విశ్రాంతి ఇవ్వనున్న నేపథ్యంలో జింబాబ్వే పర్యటనకు వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు క్రీడా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయనకు బ్యాటింగ్ కోచ్‌గా హృషికేశ్ కనిట్కర్, బౌలింగ్ కోచ్‌గా సునీల్ జోషి సహకారం అందించనున్నారు.
జింబాబ్వే పర్యటన అనంతరం జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో కూడా భారత జట్టుకు వీవీఎస్ లక్ష్మణ్ కోచ్‌గా కొనసాగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్‌లో భారత్‌కు అఫ్గానిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల క్రికెట్ టోర్నీ ఉండటంతో బీసీసీఐ ముందస్తు ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!