

భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, లక్ష్య సేన్ హైలో ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్‌ఫైనల్స్‌కు చేరుకున్నారు. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో సింధు 21-9, 21-6తో ఫ్రాన్స్‌కు చెందిన ఒక్టావియా పాంకసరిపై విజయం సాధించింది. కేవలం 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. అంతకుముందు బుధవారం రాత్రి జరిగిన రౌండ్-32లోనూ ఆమె 21-10, 21-10తో యూఏఈకి చెందిన ప్రకృతి భారతిని ఓడించింది.
మరోవైపు పురుషుల సింగిల్స్ ప్రీక్వార్టర్‌ఫైనల్‌లో లక్ష్య సేన్ 21-15, 18-21, 21-12తో భారత ఆటగాడు కిరణ్ జార్జిపై గెలిచి తదుపరి దశకు చేరాడు. అయితే మహిళల సింగిల్స్‌లో ఇషారాణి, మాళవిక బన్సోడ్ తమ ప్రీక్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌ల్లో ఓటమిపాలయ్యారు. పురుషుల సింగిల్స్ రౌండ్-32లో హెచ్‌ఎస్ ప్రణయ్, తరుణ్ కూడా పరాజయాలు ఎదుర్కొన్నారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!