30, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

Writer: Nithish 07:03 AM, 30 అక్టోబర్, 2026
ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

ముంబయి ఇండియన్స్‌ జట్టులో 2027 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన మహేల జయవర్దనే జట్టును వీడగా, సహాయక బృందంలో ఉన్న కీరన్‌ పొలార్డ్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నాడు. మరోవైపు హార్దిక్‌ పాండ్య కెప్టెన్సీపై అనిశ్చితి నెలకొంది. అతను జట్టులో కొనసాగుతాడా లేదా అన్నదానిపైనా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో తదుపరి సీజన్‌లో జట్టును నడిపించే బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే అంశంపై యాజమాన్యం చర్చిస్తున్నట్లు సమాచారం. సూర్యకుమార్‌ యాదవ్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, తిలక్‌ వర్మ పేర్లు కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఒక్క సీజన్‌ పాటు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు బాధ్యతలు అప్పగించి, ఆ తర్వాత తిలక్‌ వర్మను భవిష్యత్‌ నాయకుడిగా తీర్చిదిద్దాలని యాజమాన్యం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడం, కోచింగ్‌ బృందంలో మార్పులు చోటుచేసుకోవడంతో యువ ఆటగాడు తిలక్‌ వర్మపై ఇప్పుడే కెప్టెన్సీ భారం మోపకూడదని ముంబయి యాజమాన్యం భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, కోచింగ్‌ విభాగంలో మరిన్ని మార్పులు చేస్తూ బౌలింగ్‌ కోచ్‌లు లసిత్‌ మలింగ, పరాస్‌ మాంబ్రే, ఫీల్డింగ్‌ కోచ్‌ హాప్కిన్స్‌లకు కూడా ఫ్రాంఛైజీ వీడ్కోలు పలికింది. ఈ విషయాన్ని ముంబయి ఇండియన్స్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇప్పటికే జయవర్దనే స్థానంలో పొలార్డ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించిన నేపథ్యంలో, కొత్త సీజన్‌కు ముందు జట్టు నాయకత్వం, సహాయక సిబ్బంది విషయంలో ముంబయి ఇండియన్స్‌ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ

15 ఏళ్లకే డబ్ల్యూపీఎల్‌లోకి ఉమ కశ్వీ

టీమ్‌ఇండియా కెప్టెన్సీపై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

టీమ్‌ఇండియా కెప్టెన్సీపై తిలక్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి జట్లు ఇవే..

డబ్ల్యూపీఎల్ 2027 పూర్తి జట్లు ఇవే..

డబ్ల్యూపీఎల్‌లో అతి చిన్న వయసు ప్లేయర్.. ఎవరీ ఉమా?

డబ్ల్యూపీఎల్‌లో అతి చిన్న వయసు ప్లేయర్.. ఎవరీ ఉమా?

మైదానంలో కూల్, ఇంట్లో మాత్రం అలా కాదు... ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

మైదానంలో కూల్, ఇంట్లో మాత్రం అలా కాదు... ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

డబ్ల్యూబీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు యస్తికా భాటియా

డబ్ల్యూబీబీఎల్‌లో బ్రిస్బేన్ హీట్‌కు యస్తికా భాటియా

ట్యాగ్లు
ముంబయి ఇండియన్స్రోహిత్ శర్మహార్దిక్ పాండ్యకీరన్ పొలార్డ్తిలక్ వర్మసూర్యకుమార్ యాదవ్జస్‌ప్రీత్ బుమ్రామహేల జయవర్దనేలసిత్ మలింగఐపీఎల్ 2027
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి ‘జన మహాభియోగ్‌’
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై ఇండియా కూటమి ‘జన మహాభియోగ్‌’

తుఫాన్ బీభత్సం నుంచి కోనసీమకు ఊరట
జనరల్

తుఫాన్ బీభత్సం నుంచి కోనసీమకు ఊరట

బంగ్లాదేశ్‌ వాయుసేన మాజీ అధికారి అనుమానాస్పద మృతి
జనరల్

బంగ్లాదేశ్‌ వాయుసేన మాజీ అధికారి అనుమానాస్పద మృతి

అమెరికా న్యూక్లియర్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం
జనరల్

అమెరికా న్యూక్లియర్‌ ల్యాబ్‌లో అగ్నిప్రమాదం

రాత్రిపూట ఈ నిద్ర అలవాట్లు ఉన్నాయా? గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే
ఆరోగ్యం

రాత్రిపూట ఈ నిద్ర అలవాట్లు ఉన్నాయా? గుండె ఆరోగ్యంపై పడే ప్రభావం ఇదే

నిరుపేద మహిళల కోసం ప్రత్యేక పట్టుచీరల పథకాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్‌
జనరల్

నిరుపేద మహిళల కోసం ప్రత్యేక పట్టుచీరల పథకాన్ని ప్రారంభించిన రాఘవ లారెన్స్‌

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?
క్రీడలు

ముంబయి ఇండియన్స్‌ కెప్టెన్సీపై ఉత్కంఠ.. మళ్లీ రోహిత్‌ శర్మకు పగ్గాలు?

ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంతో హైదరాబాద్‌లో తాగునీటి కష్టాలు

మియాపూర్‌ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

మియాపూర్‌ భూములపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

రైతులకు శుభవార్త, పీఎం-కిసాన్‌ నిధులు విడుదల చేయనున్న ప్రధాని
జనరల్

రైతులకు శుభవార్త, పీఎం-కిసాన్‌ నిధులు విడుదల చేయనున్న ప్రధాని

భోజన విరామం తర్వాత ఉద్యోగులకు షాక్‌
టెక్నాలజీ

భోజన విరామం తర్వాత ఉద్యోగులకు షాక్‌

మల్లన్నసాగర్‌ వద్ద అక్రమ బ్లాస్టింగ్‌లు.. హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు
జనరల్

మల్లన్నసాగర్‌ వద్ద అక్రమ బ్లాస్టింగ్‌లు.. హరీశ్‌రావు తీవ్ర ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!