

అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా విడుదల చేసిన పురుషుల టెస్ట్ ప్లేయర్ల ర్యాంకింగ్స్‌లో ఆఫ్ఘనిస్థాన్ టెస్ట్ జట్టు కెప్టెన్ రహ్మత్ షా అరుదైన రికార్డు సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లోని ఏ విభాగంలోనైనా టాప్ 10లో చోటు దక్కించుకున్న తొలి ఆఫ్ఘనిస్థాన్ క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. బ్యాటర్ల విభాగంలో ఆరు స్థానాలు ఎగబాకిన 33 ఏళ్ల రహ్మత్ షా, కెరీర్ బెస్ట్ రేటింగ్‌తో ఏడో స్థానానికి చేరుకున్నాడు.
షార్జా వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో రహ్మత్ షా 173 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. టెస్ట్ క్రికెట్‌లో అతడికి ఇది ఐదో శతకం కాగా, ఈ ఏడాదిలో రెండోది. ఈ నిలకడైన ప్రదర్శనతో షా భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, దక్షిణాఫ్రికా ఆటగాడు ఐడెన్ మార్‌క్రమ్, శ్రీలంక స్టార్ కమిందు మెండిస్ వంటి ప్రముఖ ఆటగాళ్లను వెనక్కి నెట్టి 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవలే జింబాబ్వే, బంగ్లాదేశ్‌లతో జరిగిన ట్రై-సిరీస్‌ను గెలుచుకుని, ఐసీసీ వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో చరిత్రలోనే అత్యుత్తమంగా ఆరో స్థానానికి చేరిన ఆఫ్ఘనిస్థాన్‌కు రహ్మత్ షా ఘనత మరో మైలురాయిగా నిలిచింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!