25, నవంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

Writer: Chandrika 12:54 PM, 11 అక్టోబర్, 2026
నేటి నుంచే రంజీ ట్రోఫీ 2026–27..

దేశవాళీ క్రికెట్‌లో ప్రతిష్ఠాత్మక టోర్నీ అయిన రంజీ ట్రోఫీ 2026–27 సీజన్ ఆదివారం, అక్టోబర్ 11న ప్రారంభం కానుంది. తొలి రౌండ్‌లో దేశవ్యాప్తంగా 38 జట్లు 19 మ్యాచ్‌ల్లో తలపడనున్నాయి. అయితే, అరుణాచల్ ప్రదేశ్ క్రికెట్ సంఘంలో నెలకొన్న వివాదాల కారణంగా నాగాలాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో ఆ జట్టు పాల్గొనడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారత క్రికెట్‌లోని ప్రముఖ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్ ఈ టోర్నీలో బరిలోకి దిగనున్నారు. న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని రాహుల్ (కర్ణాటక), సిరాజ్ (హైదరాబాద్), యశస్వి (ముంబయి) తమ ఫామ్, ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవడానికి ఇది మంచి అవకాశం. భారత జట్టులోకి తిరిగి రావాలని భావిస్తున్న మహ్మద్ షమి బెంగాల్ తరఫున సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు. మరోవైపు, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బిహార్ తరఫున సుదీర్ఘ ఫార్మాట్‌లో ఎలా రాణిస్తాడనే ఆసక్తి నెలకొంది. డిఫెండింగ్ ఛాంపియన్ జమ్మూకశ్మీర్ తొలి మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌తో తలపడనుండగా, ముంబయి జట్టు చండీగఢ్‌తో పోరుతో తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.

గ్రూప్-బిలో ఉన్న హైదరాబాద్ తొలి మ్యాచ్‌లో సికింద్రాబాద్ వేదికగా త్రిపురతో తలపడనుంది. మహ్మద్ సిరాజ్ నాయకత్వంలోని హైదరాబాద్ గత సీజన్‌లో ఏడు మ్యాచ్‌ల్లో ఒక విజయం, నాలుగు డ్రాలు, రెండు ఓటములతో గ్రూపులో నాలుగో స్థానంలో నిలిచింది. ఈసారి తన్మయ్ అగర్వాల్, రాహుల్ సింగ్, హిమతేజ, అభిరథ్ రెడ్డి బ్యాటింగ్‌లో, సిరాజ్, తనయ్ త్యాగరాజన్, సీవీ మిలింద్ బౌలింగ్‌లో కీలకం కానున్నారు. అయితే, సిరాజ్ కొన్ని మ్యాచ్‌లకే అందుబాటులో ఉండనున్నాడు. మరోవైపు, రికీ భుయ్ నాయకత్వంలోని ఆంధ్ర జట్టు తొలి మ్యాచ్‌లో కర్ణాటకను ఎదుర్కోనుంది. గత సీజన్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరిన ఆంధ్ర ఈసారి మరింత ముందుకు వెళ్లాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 138 మ్యాచ్‌లతో ఈ టోర్నీ రెండు దశల్లో జరగనుంది. తొలి దశ అక్టోబర్ 11 నుంచి నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. అనంతరం సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, విజయ్ హజారే వన్డే టోర్నీలు నిర్వహిస్తారు. రెండో దశ జనవరి 17న ప్రారంభమై, లీగ్ మ్యాచ్‌ల తర్వాత ఫిబ్రవరి 9 నుంచి 13 వరకు క్వార్టర్‌ఫైనళ్లు, ఫిబ్రవరి 18 నుంచి 22 వరకు సెమీఫైనళ్లు జరగనున్నాయి. ఫైనల్ ఫిబ్రవరి 27న ప్రారంభం కానుంది. రంజీ ట్రోఫీ చరిత్రలో ముంబయి అత్యధికంగా 42 టైటిళ్లు గెలుచుకుంది. 1958–59 నుంచి 1972–73 వరకు వరుసగా 15 సార్లు విజేతగా నిలిచింది. కర్ణాటక ఎనిమిది టైటిళ్లతో తర్వాతి స్థానాల్లో ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

వైభవ్ సూర్యవంశీపై జాకబ్ ఓరమ్ ప్రశంసలు..

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

క్రైస్ట్‌చర్చ్‌ పిచ్‌పై మరీ ఎక్కువ అంచనాలు వద్దు - మ్యాట్ హెన్రీ

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

రికార్డు డబుల్ సెంచరీ వెనుక యువరాజ్ సింగ్ సలహాలే: వైభవ్ సూర్యవంశీ

ట్యాగ్లు
రంజీ ట్రోఫీ 2026-27రంజీ ట్రోఫీమహ్మద్ సిరాజ్కేఎల్ రాహుల్యశస్వి జైస్వాల్మహ్మద్ షమివైభవ్ సూర్యవంశీహైదరాబాద్ క్రికెట్ఆంధ్ర క్రికెట్భారత దేశవాళీ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే
గాసిప్స్

కార్తిక్‌ ఆర్యన్‌ ‘కాలియా’లో అనీత్‌ పడ్డా లేనట్లే

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

పంజాగుట్ట ఏఐ పోలీస్ స్టేషన్‌ను పరిశీలించిన డీజీపీ సీవీ ఆనంద్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు
జనరల్

రైళ్ల సమయపాలనలో జర్మనీని అధిగమించిన భారతీయ రైల్వేలు

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు
జనరల్

స్వదేశీ రక్షణ సాంకేతికతకు డీఎల్ఆర్ఎల్ పెద్దపీట.. ఘనంగా వార్షికోత్సవ వేడుకలు

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు
జనరల్

ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌పై రో ఖన్నా విమర్శలు

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..
జనరల్

కేరళ పాఠశాలలో తుపాకీ కలకలం..

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం
రాజకీయాలు

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం
సినిమాలు

‘ఈ నగరానికి ఏమైంది-2’పై నెగిటివిటీకి తరుణ్‌ భాస్కర్‌ ఘాటు సమాధానం

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..
జనరల్

ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఎడమచేతి చిటికెన వేలుపై చెరగని సిరా..

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ చిత్రబృందంపై పూజిత పొన్నాడ సంచలన ఆరోపణలు

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!
టెక్నాలజీ

కోటి యూనిట్ల మైలురాయిని దాటిన టీవీఎస్ జూపిటర్..!

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..
రాజకీయాలు

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!