

న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 19.4 ఓవర్లలోనే ఛేదించింది. ధాటిగా బ్యాటింగ్ చేసిన సంజూ శామ్సన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సంజూ.. సిరీస్‌లో తొలి మ్యాచ్‌ను గెలవడం ఎంతో ప్రత్యేకమని, జట్టు విజయంలో తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందని తెలిపాడు. ఈ విజయానికి జట్టులోని ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేశారని పేర్కొన్నాడు. ఇది పూర్తిగా జట్టు సమష్టి ప్రదర్శన అని, సిరీస్‌ను విజయంతో ప్రారంభించడం ఆనందంగా ఉందని చెప్పాడు.
అభిషేక్ శర్మతో కలిసి బ్యాటింగ్ చేయడంపై సంజూ స్పందిస్తూ.. క్రీజులో ఉన్నప్పుడు తమ మధ్య సంభాషణలు ఎక్కువగా బంతిని అర్థం చేసుకోవడం, దానిని బౌండరీకి తరలించే మార్గాల గురించే జరుగుతాయని వివరించాడు. బంతి నేరుగా బ్యాట్‌పైకి వస్తున్నట్లు గుర్తించామని, అందుకు అనుగుణంగా ఆడిన వ్యూహం తమకు బాగా పనిచేసిందని తెలిపాడు. అభిషేక్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించడం తనకు ఇష్టమని చెప్పిన సంజూ, పవర్‌ప్లేలో సానుకూల దృక్పథంతో దూకుడుగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు. తొలి ఆరు ఓవర్లలోనే 90కి పైగా పరుగులు రావడంతో భారత్‌కు అద్భుతమైన ఆరంభం లభించిందని, దీంతో మ్యాచ్‌పై మొదట్లోనే పట్టు సాధించగలమనే నమ్మకం కలిగిందని పేర్కొన్నాడు. అందుకే దూకుడును తగ్గించకుండా ఆడటమే తమ విజయ వ్యూహమని వివరించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!