

సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ టీ20 వరల్డ్ కప్‌ను ఘనంగా గెలుచుకున్నప్పటికీ, బోర్డు ఆయనపై కీలక నిర్ణయం తీసుకుంది. కెప్టెన్సీ విషయంలో విజయవంతమైనప్పటికీ, ఇటీవల ఆయన బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర నిరాశ కలిగించింది. ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన సూర్య 13 మ్యాచ్‌లలో కేవలం 270 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అలాగే ముంబై టీ20 లీగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోవడం సెలెక్టర్ల నిర్ణయానికి ప్రధాన కారణమైంది.
2028 టీ20 వరల్డ్ కప్, లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని భారత సెలెక్టర్లు యువ జట్టును తయారు చేయాలని నిర్ణయించారు. ఐపీఎల్‌లో అద్భుత కెప్టెన్సీ రికార్డ్ ఉన్న శ్రేయస్ అయ్యర్‌కు జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లు మరియు 2026 ఆసియా క్రీడల్లో ఆయనే జట్టును నడిపించనున్నారు. తిలక్ వర్మను వైస్ కెప్టెన్‌గా నియమించగా, నితీష్ కుమార్ రెడ్డి జట్టులో చోటు దక్కించుకున్నాడు. 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడు ప్రధాన జట్లలో స్థానం సంపాదించి సంచలనం సృష్టించాడు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!