
జనరల్

జింబాబ్వేతో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టు ఇప్పటికే జింబాబ్వే చేరుకుంది. శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో బరిలోకి దిగనున్న టీమిండియా, ఈ సిరీస్ ద్వారా తమ జట్టు కాంబినేషన్లను పరీక్షించుకోవడంతో పాటు విజయాలతో సిరీస్‌ను ఆరంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్-జింబాబ్వే మధ్య తొలి టీ20 మ్యాచ్ జూలై 23న, రెండో మ్యాచ్ జూలై 25న, మూడో మ్యాచ్ జూలై 26న జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా జరుగుతాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఫ్యాన్‌కోడ్, జీ నెట్‌వర్క్, యూనైట్ 8 స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!