

ఇండోర్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, విండీస్ హిట్టర్ షిమ్రోన్ హెట్‌మైర్ మధ్య వాగ్వాదం జరిగినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెస్టిండీస్ బ్యాటింగ్ సమయంలో నమన్ ధీర్ బౌలింగ్‌కు సిద్ధమవుతుండగా, స్ట్రైక్‌లో ఉన్న హెట్‌మైర్ నాన్‌స్ట్రైకర్‌తో సుదీర్ఘంగా మాట్లాడుతున్నట్లు కనిపించాడు. దీంతో అసహనానికి గురైన శ్రేయస్ అయ్యర్ అంపైర్‌ను కలిసి, ఓవర్ల మధ్య విండీస్ బ్యాటర్లు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనివల్ల 30 గజాల సర్కిల్ వెలుపల ఒక ఫీల్డర్‌ను తగ్గించాల్సిన పరిస్థితి రావచ్చని అతడు ఆందోళన వ్యక్తం చేశాడని తెలుస్తోంది. దీంతో అంపైర్ విండీస్ బ్యాటర్లను పిలిచి, ఆట ఆలస్యం చేయడం సరికాదని హెచ్చరించినట్లు సమాచారం.
అంపైర్ హెచ్చరిక అనంతరం క్రీజులోకి వెళ్తున్న హెట్‌మైర్.. బౌలింగ్ చేయడం అయ్యర్ పని అని, తాను మాట్లాడేందుకు సమయం తీసుకుంటానని ఘాటుగా వ్యాఖ్యానించినట్లు కథనాలు పేర్కొన్నాయి. అయితే అయ్యర్ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేయకుండా మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నమన్ ధీర్ తన బౌలింగ్‌లో హెట్‌మైర్‌ను ఔట్ చేయడంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. పెవిలియన్‌కు వెళ్తున్న హెట్‌మైర్ వైపు చూస్తూ శ్రేయస్ అయ్యర్ నవ్విన తీరు సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.





కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!