
సినిమాలు

ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-4 పోటీల్లో తెలుగు క్రీడాకారిణులు జ్యోతి సురేఖ, చికిత తానిపర్తి పతకాలతో మెరిశారు. మహిళల కాంపౌండ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో జ్యోతి సురేఖ, చికిత, ప్రీతికా ప్రదీప్‌లతో కూడిన భారత జట్టు 228-232 తేడాతో కొలంబియా జట్టుపై ఓటమి చెంది రజత పతకాన్ని సాధించింది.
మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల ప్రీతికా ప్రదీప్ ఈ టోర్నీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. టీమ్ ఈవెంట్‌లో రజతం సాధించిన ఆమె, కాంపౌండ్ వ్యక్తిగత విభాగంలో కాంస్య పతకాన్ని కూడా గెలుచుకుంది. భారత ఆర్చరీకి అంతర్జాతీయ వేదికపై ఈ విజయాలు మరింత ఉత్సాహాన్ని అందించాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!