
జనరల్

టీమ్‌ఇండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టినట్లు వార్తలు వస్తున్నాయి. ముంబయి ఇండియన్స్ జట్టులో చేరిన నేపథ్యంలోనే తన చిరకాల ప్రేయసి, నటి సమ్రీన్ కౌర్‌తో జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న సమ్రీన్‌కు బుధవారం న్యూజిలాండ్‌లో అర్ష్‌దీప్ ప్రపోజ్ చేసినట్లు సమాచారం. దీంతో వీరిద్దరి ప్రేమ బంధం మరో ముందడుగు వేసింది.
అర్ష్‌దీప్‌తో నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలను సమ్రీన్ కౌర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జమ్మూకశ్మీర్‌కు చెందిన సమ్రీన్ నటిగా, మోడల్‌గా గుర్తింపు పొందింది. 2018లో మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. తాజాగా వీరిద్దరి నిశ్చితార్థానికి సంబంధించిన వార్తలు క్రికెట్, సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!