

400 మీటర్ల హర్డిల్స్ అంటే భారత అథ్లెటిక్స్‌లో పీటీ ఉష పేరు గుర్తుకొస్తుంది. నాలుగు దశాబ్దాలుగా కొనసాగిన ఆమె జాతీయ రికార్డును విద్య రామ్‌రాజ్ బద్దలు కొట్టింది. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య 54.75 సెకన్ల వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనతో కాంస్య పతకం సాధించింది. 1984 లాస్ ఏంజెలెస్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష 55.42 సెకన్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును విద్య అధిగమించింది. ఈ ఆసియా క్రీడల్లో విద్యకు ఇది రెండో పతకం. అంతకుముందు 4×400 మీటర్ల మిక్స్‌డ్ రిలేలో రజతం సాధించిన భారత జట్టులో ఆమె సభ్యురాలిగా ఉంది.
తమిళనాడులోని కోయంబత్తూర్‌కు చెందిన విద్యది సాధారణ కుటుంబం. ఆమె తండ్రి ట్రక్ డ్రైవర్‌గా పనిచేశారు. పిల్లలకు క్రీడల్లో శిక్షణ ఇప్పించాలనుకున్న విద్య తల్లి.. కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఆమెను, కవల సోదరి నిత్యను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్‌లో చేర్పించారు. అక్కడ కోచ్ నేహా పాల్ సింగ్ ప్రోత్సాహంతో విద్య అథ్లెటిక్స్‌ను ఎంచుకుంది. తొలుత 100, 200 మీటర్లపై దృష్టి పెట్టిన ఆమె 2017లో 400 మీటర్ల హర్డిల్స్‌కు మారింది. 2022 ఆసియా క్రీడలు, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 4×400 మీటర్ల రిలే జట్లకు కూడా విద్య ప్రాతినిధ్యం వహించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!