4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మహిళల ఆసియా కప్‌లో భారత్‌ జోరు..

Writer: Chandrika 02:32 PM, 4 సెప్టెంబర్, 2026
మహిళల ఆసియా కప్‌లో భారత్‌ జోరు..

మహిళల ఆసియా కప్‌లో భారత జట్టు సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. గురువారం జరిగిన గ్రూప్‌-ఎ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్‌ సేన హాంకాంగ్‌ను 137 పరుగుల తేడాతో చిత్తు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 193 పరుగులు చేసింది. స్మృతి మంధాన 64 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్సర్లతో 124 పరుగుల సూపర్‌ సెంచరీ సాధించింది. షెఫాలి వర్మతో కలిసి తొలి వికెట్‌కు 74 పరుగులు జోడించింది. షెఫాలి ఔటైన తర్వాత మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించకపోయినా.. స్మృతి ఒంటరి పోరాటంతో భారత్‌ను భారీ స్కోరుకు చేర్చింది.

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన హాంకాంగ్‌ భారత బౌలర్ల ధాటికి 16.2 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. దీప్తి శర్మ 3/9తో విజృంభించగా, నందని శర్మ, ప్రేమ రావత్‌, శ్రీచరణి రెండేసి వికెట్లు తీశారు. హాంకాంగ్‌ చివరి 9 వికెట్లను కేవలం 27 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో శతకంతో స్మృతి మంధాన రెండు అరుదైన రికార్డులు సాధించింది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 10,880 పరుగులతో మిథాలీ రాజ్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరురాలిగా నిలిచింది. అలాగే 18 అంతర్జాతీయ శతకాలతో మహిళల క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించింది. భారత్‌ శనివారం తన చివరి గ్రూప్‌ మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
ట్యాగ్లు
మహిళల ఆసియా కప్‌భారత మహిళల జట్టుస్మృతి మంధానహర్మన్‌ప్రీత్‌ కౌర్‌హాంకాంగ్‌ మహిళల జట్టుదీప్తి శర్మషెఫాలి వర్మభారత క్రికెట్‌ఆసియా కప్‌ సెమీఫైనల్స్‌మహిళల క్రికెట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!