

భారత యువ రేసింగ్ సంచలనం అతికా మీర్ అంతర్జాతీయ కార్టింగ్ వేదికపై మరోసారి సత్తా చాటింది. ఎఫ్‌ఐఏ యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో 12–14 ఏళ్ల విభాగంలో పోటీ పడుతున్న 11 ఏళ్ల అతికా.. మూడో రౌండ్‌లో తొమ్మిదో స్థానంలో, నాలుగో రౌండ్‌లో పదో స్థానంలో నిలిచింది. అత్యంత పోటీ ఉండే ఈ ఛాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు టాప్-10 ఫినిష్‌లు సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి నిరూపించుకుంది.
కార్టింగ్‌లోని అత్యున్నత పోటీల్లో ఒకటిగా భావించే ఎఫ్‌ఐఏ ఛాంపియన్‌షిప్‌ను ‘ఫార్ములా వన్ ఆఫ్ కార్టింగ్’గా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యుత్తమ యువ డ్రైవర్లు ఈ సిరీస్‌లో పాల్గొంటారు. ఇలాంటి కఠినమైన పోటీలో అతికా సాధించిన వరుస టాప్-10 ఫలితాలు భారత మోటార్‌స్పోర్ట్స్‌కు గర్వకారణంగా నిలిచాయి. తన ప్రదర్శనపై సంతోషంగా ఉన్నానని, డ్రైవింగ్ మరింత మెరుగైందని, భవిష్యత్‌లో మరిన్ని సవాళ్లకు సిద్ధంగా ఉన్నానని అతికా తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!