

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెబ్సైట్లో గదిని బుక్ చేసేందుకు ఓ ఏఐ ఏజెంట్‌ను ఉపయోగించిన ప్రయోగం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ‘చాట్‌జీపీటీ-6 ఆస్ట్రా’తో ఈ ప్రయోగం చేసినట్లు ఓ టెకీ వెల్లడించారు. యూజర్ లాగిన్ వివరాలతో టీటీడీ వెబ్సైట్లోకి ప్రవేశించిన ఏఐ ఏజెంట్.. వసతి బుకింగ్ ప్రక్రియను దాదాపు చివరి దశ వరకు తీసుకెళ్లినట్లు తెలిపారు. అవసరమైన ఆప్షన్లను స్వయంగా ఎంచుకుని బుకింగ్ ప్రక్రియను కొనసాగించినట్లు వివరించారు.
అయితే పేమెంట్ దశకు చేరుకున్న తర్వాత ఏఐ ఏజెంట్ ప్రక్రియను పూర్తి చేయలేకపోయినట్లు టెకీ తెలిపారు. బ్యాంకు లేదా చెల్లింపు వివరాలు అందుబాటులో లేకపోవడంతో బుకింగ్ పూర్తికాలేదని వెల్లడించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన వీడియో ‘టెక్ బై పవన్’ అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ప్రచురితమై వైరల్‌గా మారింది. దర్శన టికెట్ లేకుండా వసతి బుకింగ్ సాధ్యం కాదని టీటీడీ ఐటీ అధికారి స్పష్టం చేసినట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!