

ప్రముఖ టెక్నాలజీ సంస్థ అడోబ్ (Adobe) తదుపరి ప్రెసిడెంట్, సీఈఓగా భారత సంతతికి చెందిన అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు. 2026 డిసెంబర్ 1 నుంచి ఆయన ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న శంతను నారాయణ్ ఈ పదవి నుంచి తప్పుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా కొనసాగనున్నారు. ప్రపంచ టెక్నాలజీ రంగంలో కీలక స్థానంలో ఉన్న అడోబ్ నాయకత్వ బాధ్యతలు భారత సంతతికి చెందిన వ్యక్తికి దక్కడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ప్రస్తుతం అనిల్ చక్రవర్తి అడోబ్‌లో కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఆర్కెస్ట్రేషన్ విభాగంతో పాటు ప్రపంచవ్యాప్త ఫీల్డ్ ఆపరేషన్స్‌ను పర్యవేక్షిస్తున్నారు. అంతకుముందు ఆయన ఇన్ఫర్మాటికా (Informatica) సంస్థ సీఈఓగా పనిచేశారు. అంతర్జాతీయ టెక్నాలజీ రంగంలో ఆయనకు విశేష అనుభవం ఉంది. అడోబ్ తదుపరి నాయకుడిగా ఆయన నియామకంతో సంస్థ వ్యాపార వ్యూహాలు, భవిష్యత్ ప్రణాళికలపై ఆసక్తి నెలకొంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!