

ఐఫోన్ యూజర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాపిల్ సరికొత్త ఆపరేటింగ్ సిస్టమ్ iOS 27 అధికారికంగా విడుదలైంది. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ వినియోగదారులకు ఈ అప్‌డేట్ అందుబాటులోకి వచ్చింది. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు, మెరుగైన యూజర్ అనుభూతి, భద్రతా ఫీచర్లతో iOS 27ను యాపిల్ రూపొందించింది. జూన్‌లో జరిగిన WWDC 2026లో తొలిసారిగా ఈ ఓఎస్‌ను పరిచయం చేసింది. అప్‌డేట్ చేసే ముందు కీలక సమాచారాన్ని బ్యాకప్ చేసుకోవడంతో పాటు ఫోన్‌లో తగినంత బ్యాటరీ ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. Settings > General > Software Updateలోకి వెళ్లి iOS 27ను ఎంచుకుని Download and Installపై ట్యాప్ చేస్తే అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇన్‌స్టాలేషన్ పూర్తయ్యే వరకు స్క్రీన్‌పై కనిపించే సూచనలను అనుసరించాలి.
iPhone 11 నుంచి ఆ తర్వాతి మోడళ్లతో పాటు iPhone 17 సిరీస్, రెండో, మూడో తరం iPhone SEలకు iOS 27 అప్‌డేట్ అందుబాటులో ఉంది. కొత్త ఓఎస్‌లో సిరి అనుభూతిని మరింత మెరుగుపరిచారు. సిరి కోసం ప్రత్యేక యాప్‌ను తీసుకువచ్చి, Google Gemini, Apple మోడల్స్ కలయికతో మరింత అధునాతన సంభాషణలకు అవకాశం కల్పించారు. ఫోన్‌లోని వివిధ యాప్‌లలో ఉన్న సమాచారాన్ని అర్థం చేసుకుని యూజర్ అడిగిన ప్రశ్నకు అనుగుణంగా ఫలితాలను అందించే సామర్థ్యాన్ని సిరికి జోడించారు. Visual Intelligence ఫీచర్‌ను కూడా మరింత సులభతరం చేశారు. కెమెరా ద్వారా కనిపించే వస్తువులు, దృశ్యాలను విశ్లేషించడంతో పాటు వాటి గురించి సిరిని ప్రశ్నించవచ్చు. iOS 26లో పరిచయం చేసిన Liquid Glass డిజైన్‌కు మరిన్ని కస్టమైజేషన్ ఆప్షన్లు ఇచ్చారు. పిల్లల ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులకు నియంత్రణ కల్పించేలా Ask to Buy, Ask to Browse, Contact Approvals, Time Allowance, Schedules వంటి కొత్త కంట్రోల్స్‌ను కూడా అందించారు. యాప్ డౌన్‌లోడ్, కొత్త వెబ్‌సైట్ యాక్సెస్, స్క్రీన్ టైమ్ వంటి అంశాలపై తల్లిదండ్రులు పరిమితులు విధించవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!