

భారతీయ ఐఫోన్ వినియోగదారులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆపిల్ పే సేవలు దేశంలో అందుబాటులోకి వచ్చాయి. ప్రారంభ దశలో యాక్సిస్ బ్యాంక్‌కు చెందిన వీసా, మాస్టర్‌కార్డ్ క్రెడిట్ కార్డులను ఆపిల్ వాలెట్‌లో జత చేసుకునే అవకాశం కల్పించారు. రూపే క్రెడిట్ కార్డులకు కూడా త్వరలో మద్దతు లభించనున్నట్లు సమాచారం. ఆపిల్ పే ద్వారా ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న చెల్లింపు యంత్రాల వద్ద ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్‌ను ఉంచి సులభంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు చేయవచ్చు. ఇందుకోసం ఐఫోన్ పక్క బటన్‌ను రెండుసార్లు నొక్కి, ఫేస్ ఐడీ, టచ్ ఐడీ లేదా పాస్‌కోడ్‌తో ధ్రువీకరణ పూర్తి చేస్తే చెల్లింపు పూర్తవుతుంది.
ఆఫ్‌లైన్ దుకాణాలతో పాటు ఎంపిక చేసిన ఆన్‌లైన్ వేదికల్లోనూ ఆపిల్ పే ద్వారా చెల్లింపులు చేసే అవకాశం ఉంది. బ్లింకిట్, జొమాటో, జెప్టో, మేక్‌మైట్రిప్, ఇక్సిగోతో పాటు టాటా, రిలయన్స్ బ్రాండ్స్‌కు చెందిన కొన్ని దుకాణాల్లో ఈ చెల్లింపు సదుపాయం అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఆపిల్ పేలో కార్డును జోడించేందుకు ఆపిల్ వాలెట్ యాప్‌లోని ‘+’ గుర్తుపై నొక్కి, తెరపై కనిపించే సూచనలను పాటించాలి. లావాదేవీల భద్రత కోసం అసలు కార్డు నంబర్‌కు బదులుగా ప్రత్యేక పరికర ఖాతా నంబర్, ప్రతి లావాదేవీకి ప్రత్యేకమైన భద్రతా కోడ్‌ను ఉపయోగిస్తామని ఆపిల్ తెలిపింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!