

2026 మేలో సైబర్ సెక్యూరిటీ సంస్థ Irregular నిర్వహించిన పరీక్షలో గూగుల్ జెమినీ ఏఐ మోడల్ మూడు వాస్తవ కంపెనీల కంప్యూటర్ సిస్టమ్స్‌ను యాక్సెస్ చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. ఈ పరీక్షను “క్యాప్చర్ ది ఫ్లాగ్” విధానంలో Irregular మౌలిక వసతులపై నిర్వహించినట్లు సమాచారం. అయితే జెమినీకి ఇంటర్నెట్ యాక్సెస్ లభించడంతో, పరీక్షలో భాగం కాని నిజమైన సంస్థల సిస్టమ్స్ వరకు అది చేరినట్లు తెలుస్తోంది. ఒక సందర్భంలో పాస్‌వర్డ్‌ను ఊహించి, మరో రెండు సందర్భాల్లో పబ్లిక్ రిపాజిటరీలో లభించిన క్రెడెన్షియల్స్‌ను ఉపయోగించినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
నిజమైన కంపెనీల సిస్టమ్స్‌ను యాక్సెస్ చేసినట్లు గుర్తించిన వెంటనే జెమినీ తన చర్యలను నిలిపివేసిందని గూగుల్ తెలిపింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదని, సెక్యూరిటీ టెస్టింగ్ లేదా బగ్ బౌంటీ పరీక్షల్లో ఎదురయ్యే పరిస్థితులతో దీనిని పోల్చవచ్చని కంపెనీ పేర్కొంది. ఈ ఘటనలో ఉపయోగించిన జెమినీ మోడల్ వివరాలను గూగుల్ వెల్లడించలేదు. అయితే అది తమ తాజా మోడల్ కాదని తెలిపినట్లు సమాచారం. ఇదే సమయంలో OpenAI, Anthropicలకు చెందిన ఏఐ సిస్టమ్స్‌కు సంబంధించిన సైబర్ సెక్యూరిటీ పరీక్షల్లోనూ ఇలాంటి ఘటనలు నమోదయ్యాయి. జెమినీని సైబర్ దాడుల కోసం దుర్వినియోగం చేయడానికి ప్రయత్నించిన సందర్భాలను గూగుల్ గతంలో కూడా వెల్లడించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!