

యూజర్ల లొకేషన్ డేటాను గూగుల్ నిర్వహించిన విధానంపై ఐర్లాండ్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (DPC) చేపట్టిన దర్యాప్తు పూర్తైంది. 2018 మే 25 నుంచి 2020 ఫిబ్రవరి 4 వరకు జరిగిన డేటా ప్రాసెసింగ్‌ను పరిశీలించిన కమిషన్, GDPRలోని చట్టబద్ధత, పారదర్శకత, న్యాయబద్ధత, అకౌంటబిలిటీ, డేటా నిల్వకు సంబంధించిన నిబంధనల్లో గూగుల్ ఉల్లంఘనలు చేసినట్లు తేల్చింది.
Web & App Activity, Location History, Location Accuracy ఫీచర్లలో లొకేషన్ డేటా వినియోగంపై వినియోగదారులకు తగినంత స్పష్టత లేదని DPC పేర్కొంది. ఈ డేటా ద్వారా యూజర్ల ఆసక్తులను అంచనా వేయడం లేదా ప్రకటనలపై ప్రభావం చూపే విధంగా ఉపయోగించే అవకాశం ఉన్నప్పటికీ, వినియోగదారులకు అది పూర్తిగా తెలియకపోవచ్చని కమిషన్ తెలిపింది. అవసరానికి మించి డేటాను నిల్వ చేయడంపైనా అభ్యంతరం వ్యక్తం చేసింది. €403 మిలియన్ జరిమానాతో పాటు ఆరు నెలల్లోగా సంబంధిత డేటా ప్రాసెసింగ్ విధానాలను GDPRకు అనుగుణంగా మార్చాలని గూగుల్‌ను ఆదేశించింది. 2019 నుంచి లొకేషన్ డేటా నిర్వహణలో గణనీయమైన మార్పులు చేశామని గూగుల్ తెలిపింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!