

టెక్ దిగ్గజం గూగుల్ తన తాజా కృత్రిమ మేధస్సు మోడల్ జెమినై 3.7 ఫ్లాష్‌ను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, కోడింగ్, నాలెడ్జ్ వర్క్, వెబ్ డెవలప్‌మెంట్ వంటి రంగాల్లో మెరుగైన పని తీరును అందించడమే లక్ష్యంగా ఈ కొత్త ఏఐ మోడల్‌ను రూపొందించినట్లు గూగుల్ తెలిపింది. ఇది గతంలో విడుదలైన జెమినై 3.6 ఫ్లాష్కు కొనసాగింపుగా వచ్చింది.
ప్రస్తుతం జెమినై 3.7 ఫ్లాష్‌ను డెవలపర్లు, సంస్థలు, వ్యక్తిగత వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి తెస్తున్నారు. డెవలపర్లు గూగుల్ యాంటి గ్రావిటీ, గూగుల్ ఏఐ స్టూడియో, ఆండ్రాయిడ్ స్టూడియో ద్వారా దీన్ని ఉపయోగించవచ్చు. సంస్థలకు జెమినై ఎంటర్‌ప్రైజ్ ఏజెంట్ ప్లాట్‌ఫామ్, జెమినై ఎంటర్‌ప్రైజ్ యాప్ ద్వారా యాక్సెస్ లభిస్తుంది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో గూగుల్ ఏఐ ప్రో, అల్ట్రా చందాదారులు జెమినై యాప్ ద్వారా కొత్త మోడల్‌ను ఉపయోగించవచ్చు. జెమినై స్పార్క్ను కూడా జెమినై 3.7 ఫ్లాష్‌తో అప్‌గ్రేడ్ చేస్తున్నారు.
క్లిష్టమైన వర్క్‌ఫ్లోలు, కోడింగ్, డాక్యుమెంట్ విశ్లేషణ, వర్క్‌ఫ్లో ఆటోమేషన్, వెబ్ డెవలప్‌మెంట్, సుదీర్ఘ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ పనుల్లో జెమినై 3.7 ఫ్లాష్ మెరుగైన పనితీరును చూపుతుందని గూగుల్ పేర్కొంది. పలు బెంచ్‌మార్క్ పరీక్షల్లో జెమినై 3.6 ఫ్లాష్‌తో పాటు కొన్ని పోటీ ఏఐ మోడళ్లను అధిగమించినట్లు కంపెనీ తెలిపింది.
ఫ్రాంటియర్‌కోడ్ 1.1 మెయిన్ పరీక్షలో జెమినై 3.7 ఫ్లాష్ 43.6 శాతం స్కోర్ సాధించింది. జెమినై 3.6 ఫ్లాష్ 34.4 శాతం, క్లాడ్ సోనెట్ 5 42.7 శాతం, జీపీటీ-5.6 టెర్రా 41.3 శాతం స్కోర్లు సాధించాయి. అయితే డీప్‌ఎస్‌డబ్ల్యూఈ వి1.1 పరీక్షలో జీపీటీ-5.6 టెర్రా 69.6 శాతం స్కోర్‌తో జెమినై 3.7 ఫ్లాష్ సాధించిన 65.3 శాతం కంటే మెరుగైన ఫలితాన్ని నమోదు చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!