

కొత్త తరం టెక్నాలజీలో పోటీపడాలంటే భారత్ స్వంతంగా డీప్‌సీక్ తరహా ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేసుకోవాలని బ్రోకరేజ్ దిగ్గజం బెర్న్‌స్టైన్ తన నివేదికలో పేర్కొంది. అలా చేయకపోతే అమెరికా లేదా చైనా ఏఐ మోడళ్లపై ఆధారపడాల్సి వస్తుందని, ఇది భౌగోళిక రాజకీయ రిస్క్‌లను పెంచుతుందని హెచ్చరించింది. అమెరికా ఇటీవల అధునాతన ఏఐ మోడళ్లపై విధించిన ఆంక్షలు గ్లోబల్ ఏఐ రేసులో కీలక మలుపని నివేదిక పేర్కొంది.
అధునాతన లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్‌ను దేశాలు వ్యూహాత్మక ఆస్తులుగా పరిగణిస్తున్నాయని బెర్న్‌స్టైన్ తెలిపింది. విదేశీ ఏఐపై ఆధారపడుతూ కేవలం అప్లికేషన్ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెట్టడం వల్ల భవిష్యత్ టెక్నాలజీపై నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఏఐను “కొత్త తరం ఫైటర్ జెట్”తో పోల్చుతూ, ప్రభుత్వాలు దీనిని జాతీయ భద్రత, ఆర్థిక శక్తి కోసం కీలక ఆస్తిగా చూస్తున్నాయని వివరించింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!