
జనరల్

మహీంద్రా తన ప్రముఖ SUV స్కార్పియో-ఎన్ 2026 వెర్షన్‌ను భారత మార్కెట్లో రూ.13.69 లక్షల ప్రారంభ ధరతో అధికారికంగా విడుదల చేసింది. కొత్త మోడల్‌లో డిజైన్‌లో పెద్ద మార్పులు చేయకుండా, ప్రీమియం ఫీచర్లను జోడించింది. 540-డిగ్రీ కెమెరా సిస్టమ్, పనోరమిక్ సన్‌రూఫ్, లెవల్-2 ADAS, కొత్త డ్యాష్‌బోర్డ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి అప్‌డేట్లను అందించారు.
ఎక్స్‌టీరియర్‌లో మస్క్యులర్ లుక్‌ను కొనసాగిస్తూ కొన్ని వేరియంట్లలో కొత్త 18 అంగుళాల అలాయ్ వీల్స్‌ను అందించారు. Z8L టాప్ వేరియంట్‌లో లభించే 540-డిగ్రీ కెమెరా ఇరుకైన రోడ్లు, పార్కింగ్, ఆఫ్-రోడ్ డ్రైవింగ్ సమయంలో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. 2026 స్కార్పియో-ఎన్‌లో 2.0 లీటర్ టర్బో పెట్రోల్, 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్లను కొనసాగించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!