

యాపిల్ నుంచి రానున్న ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్లలో భారీ కెమెరా అప్గ్రేడ్లు ఉండనున్నాయని తాజా లీకులు సూచిస్తున్నాయి. చైనా నుంచి వెలువడిన సమాచారం ప్రకారం, ఈ ఫోన్లలో ప్రధాన కెమెరా మాడ్యూల్ గత తరం మోడళ్లతో పోలిస్తే సుమారు 2 మిల్లీమీటర్లు పెద్దదిగా ఉండొచ్చని తెలుస్తోంది. దీంతో కెమెరా బంప్ మరింత మందంగా, లెన్స్‌లు కూడా పెద్దవిగా ఉండే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.
ప్రధాన కెమెరాలో వేరియబుల్ అపర్చర్ టెక్నాలజీని యాపిల్ అందించే అవకాశముందని లీకులు వెల్లడిస్తున్నాయి. దీని ద్వారా వివిధ కాంతి పరిస్థితుల్లో మెరుగైన ఫోటోగ్రఫీ అనుభవం లభించే అవకాశం ఉంది. ఐఫోన్ 18 ప్రో సిరీస్‌లో 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, పెద్ద బ్యాటరీ, టీఎస్ఎంసీ తయారు చేసే 2 నానోమీటర్ A20 చిప్సెట్ ఉండవచ్చని సమాచారం. అయితే ఈ వివరాలపై యాపిల్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!