
రాజకీయాలు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన కొత్త ‘ఎన్’ సిరీస్‌లో తొలి ఫోన్‌గా వన్‌ప్లస్ ఎన్6ను విడుదల చేసింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6360 చిప్‌సెట్‌తో పాటు 8000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో ఆకర్షణగా నిలుస్తోంది. 6.75 అంగుళాల హెచ్‌డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఐపీ65 రేటింగ్ మరియు ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఆక్సిజన్‌ఓఎస్ 16తో ఈ ఫోన్ వస్తోంది.
కెమెరా విభాగంలో 50 ఎంపీ ప్రధాన కెమెరా, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అందించారు. 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. రూ.22,999 నుంచి ప్రారంభమయ్యే ఈ ఫోన్ డిస్కౌంట్లతో రూ.19,999 వరకు అందుబాటులో ఉంటుంది. జులై 4 నుంచి అమెజాన్‌లో సేల్ ప్రారంభమవుతుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!