

శాంసంగ్ తన కొత్త గెలాక్సీ ఎస్26 ఎఫ్‌ఈ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. అమెరికాలో దీని ప్రారంభ ధర 699.99 డాలర్లుగా నిర్ణయించింది. ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ 9తో వచ్చే ఈ ఫోన్.. ఫ్లాగ్‌షిప్ మోడళ్ల కంటే ముందుగానే కొత్త సాఫ్ట్‌వేర్ అనుభవాన్ని అందిస్తోంది. 6.7 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ+ డైనమిక్ అమోలెడ్ 2ఎక్స్ డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, గరిష్ఠంగా 1,900 నిట్స్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
ఫోన్‌లో 3 నానోమీటర్ టెక్నాలజీతో రూపొందించిన ఎగ్జినోస్ 2500 చిప్‌సెట్, 8 జీబీ ర్యామ్, 4,900 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. 45 వాట్ల వైర్డ్, 15 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. కెమెరా విభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరాలతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో 12 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు.
వన్ యూఐ 9లో భాగంగా మై ఫ్యాన్‌క్యామ్, హారిజాంటల్ లాక్, ఫోటో అసిస్ట్ వంటి ఏఐ ఆధారిత ఫీచర్లను శాంసంగ్ అందించింది. మై ఫ్యాన్‌క్యామ్ వీడియోలో ఎంచుకున్న వ్యక్తిని ఆటోమేటిక్‌గా ట్రాక్ చేస్తుంది. హారిజాంటల్ లాక్ 360 డిగ్రీల వరకు ఫోన్ తిప్పినా వీడియోను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పిస్టాచియో, బ్లూబెర్రీ, గ్రాఫైట్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులోకి వస్తుంది. విక్రయాలు సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!