
జనరల్

‘స్కైరూట్ ఏరోస్పేస్’ను స్థాపించి అతి తక్కువ సమయంలోనే వేల కోట్ల విలువైన యూనికార్న్ సంస్థగా తీర్చిదిద్దిన సీఈఓ పవన్ కుమార్ చందన, సీఓఓ నాగ భరత్ డాకా ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. హైదరాబాద్‌కు చెందిన పవన్ స్థానికంగానే విద్యాభ్యాసం పూర్తి చేసి, 2007లో ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ (మెకానికల్ ఇంజినీరింగ్)లో చేరారు. అనంతరం ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేసి రాకెట్ రూపకల్పన, అభివృద్ధిలో అనుభవం సంపాదించారు.
ఇస్రోలో సహచర శాస్త్రవేత్తలుగా పనిచేసిన పవన్, నాగభరత్ ఒకే ఆలోచనా ధోరణితో ప్రైవేట్ స్పేస్ కంపెనీ స్థాపించాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగాలను వదిలి స్కైరూట్ ఏరోస్పేస్‌ను ప్రారంభించి ఎన్నో సవాళ్లను అధిగమించారు. చిన్ననాటి చదువుల్లో ఎదురైన ఇబ్బందుల నుంచి అంతరిక్ష రంగంలో విజయవంతమైన పారిశ్రామికవేత్తగా ఎదిగిన పవన్ ప్రయాణం యువతకు ఆదర్శంగా నిలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!