
జనరల్

ప్రముఖ ఫ్రీ, ఓపెన్ సోర్స్ మీడియా ప్లేయర్ VLC మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 7 బిలియన్ డౌన్‌లోడ్స్‌ను పూర్తి చేసుకుంది. వీడియోలాన్ గణాంకాల ప్రకారం 2026 ఆగస్టులో ఈ మైలురాయిని చేరుకుంది. 6 బిలియన్ డౌన్‌లోడ్స్ దాటిన కేవలం 18 నెలల్లోనే మరో బిలియన్ డౌన్‌లోడ్స్‌ను సాధించడం విశేషం.
VLCకి యాడ్స్ లేకపోవడం, సబ్‌స్క్రిప్షన్ అవసరం లేకపోవడం, ఓపెన్ సోర్స్‌గా అందుబాటులో ఉండటం వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వివిధ మీడియా ఫార్మాట్లను సులభంగా ప్లే చేయగలగడంతో ప్రపంచవ్యాప్తంగా చాలాకాలంగా ఇది నమ్మకమైన మీడియా ప్లేయర్‌గా కొనసాగుతోంది. 7 బిలియన్ డౌన్‌లోడ్స్ మైలురాయి దాని ప్రజాదరణకు నిదర్శనంగా నిలిచింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!